కవితను కలిసిన మాజీ మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
- కవితతో మాజీ మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్ ములాఖత్
- ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్ అయ్యారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు తీహార్ జైలుకు వెళ్లి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ వెళ్లారు. గతంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ కూడా కవితను కలిసిన విషయం తెలిసిందే. అలాగే రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా కవితతో ములాఖత్ అయిన విషయం తెలిసిందే.