వయనాడ్‌ను గెలుచుకునేది ప్రియాంకే: శశిథరూర్
- వయనాడ్ ను వదులుకుంటున్న రాహుల్.. ఇక్కడి నుంచి ప్రియాంక పోటీ
- కేరళ తరఫున గళమెత్తేందుకు పార్లమెంటుకు వెళ్తున్నారన్న సచిన్ పైలట్
- రాహుల్ ఇక్కడ లేరనే భావనను ప్రియాంక భర్తీ చేస్తారని వ్యాఖ్య
వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ఎక్స్ వేదికగా హింట్ ఇచ్చారు. ఇక సందేహం లేదు... వయనాడ్‌ను గెలుచుకునేది ప్రియాంకే అంటూ ఆమె ఫొటోను షేర్ చేశారు. కేరళ ప్రజల తరఫున గళమెత్తేందుకు ప్రియాంక పార్లమెంటుకు వెళుతున్నారని... ఇకపై ఇద్దరు గాంధీలు పోరాటానికి సిద్ధమయ్యారని సచిన్ పైలట్ ట్వీట్ చేశారు. ప్రియాంక గాంధీ వయనాడ్‌కు రావడంపై మహిళా ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇక్కడ లేరనే భావనను ఆమె భర్తీ చేస్తారని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ లోక్ సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి... రెండుచోట్ల విజయం సాధించారు. ఆయన ఒక స్థానాన్ని ఖాళీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వయనాడ్‌ను వదులుకుంటారనే చర్చ సాగింది. ఈ క్రమంలో వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేస్తోంది.