ఖైదీతో సన్నిహితంగా మహిళా పోలీసు అధికారి.. బ్రిటన్‌లో కలకలం!
- లండన్‌లోని వాండ్స్‌వర్త్ కారాగారంలో ఘటన
- ఖైదీతో సన్నిహితంగా ఉన్న మహిళా అధికారి వీడియో వైరల్
- ఘటనపై దర్యాప్తు ప్రారంభం, నిందితురాలిపై కేసు నమోదు
ఖైదీతో శారీరకంగా దగ్గరైన ఓ బ్రిటన్ మహిళ జైలు అధికారిపై తాజాగా కేసు నమోదైంది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు జరుగుతున్న విషయాన్ని స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసు శాఖ ధ్రువీకరించింది. సౌత్‌వెస్ట్ లండన్‌లోని వాండ్స్‌వర్త్ కారాగారంలో ఈ ఘటన వెలుగు చూసింది. వీడియోలో నిందితురాలు యూనిఫాంలో ఉండగానే ఖైదీకి దగ్గరనైట్టు ఉంది. దీంతో, ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ దుష్ప్రవర్తన కనబరిచిన నేరంపై జైలు అధికారి లిండా డిసౌజా ఆబ్రూ (30)పై కేసు నమోదు చేశారు. త్వరలో ఆమె అక్సబ్రిడ్జి్ మెజిస్ట్రేట్స్ కోర్టులో హాజరుకానున్నారు.
వాండ్స్‌వర్త్ కారాగారంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైలు సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని పలు సమీక్షల్లో తేలింది. 1851లో నిర్మించిన ఈ జైల్లో 63 శాతం మంది ఖైదీలు అదనంగా ఉన్నట్టు అధికారులు తేల్చారు. సిబ్బంది కొరత, ఖైదీల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తేల్చారు. ఈ మేరకు మే నెలలోనే చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ప్రిసన్స్ చార్లీ టేలర్ జస్టిస్ సెక్రెటరీ అలెక్స్ ఛాక్‌కు నివేదిక సమర్పించారు. చివరకు ఇది జైళ్ల గవర్నర్ రాజీనామాకు కారణమైంది.