ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్, మోహన్‌బాబు.. వైరల్ అవుతున్న ఫొటో

  • విమానంలో ప్రయాణిస్తున్నట్టుగా ఉన్న ఫొటో
  • స్నేహమేరా జీవితం అంటూ ఫొటోను షేర్ చేసిన మోహన్‌బాబు
  • ఇద్దరినీ ఇలా చూడడం బాగుందంటూ అభిమానుల ఆనందం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు మధ్య స్నేహం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సుదీర్ఘకాలంపాటు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. మోహన్‌బాబు చెన్నై వెళ్లినా, రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినా ఒకరినొకరు కలుసుకోకుండా వెళ్లడం అనేది ఉండదు. 

పెదరాయుడు సినిమాలో కలిసి నటించిన తర్వాత ఇద్దరూ కలిసి మరో సినిమా చేసే అవకాశం రాలేదు. ఇక, వీరెప్పుడు కలిసినా వారిమధ్య స్నేహం విరబూస్తూ ఉంటుంది. తాజాగా, వీరిద్దరూ ఒకే విమానంలో పక్కపక్కన కూర్చుని ప్రయాణిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ ఫొటోను షేర్ చేసిన మోహన్‌బాబు.. ‘అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా స్నేహమేరా జీవితం’ అని క్యాప్షన్ తగిలించారు. మోహన్‌బాబు ముఖాన్ని పట్టుకున్న రజనీకాంత్ స్మైలీఫేస్ కోసం పెదవులను విప్పుతున్నట్టుగా ఉన్న ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. సూపర్‌స్టార్‌ను, కలెక్షన్ కింగ్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడడం బాగుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  



More Telugu News