బాలయ్య నటనకు నేటితో 50 ఏళ్లు.. ఎల్లుండి అతిరథ మహారథుల సమక్షంలో ఘన సన్మానం

  • 1974 ఆగస్ట్ 30న విడుదలైన 'తాతమ్మ కల' బాలయ్య తొలి చిత్రం
  • ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య
  • సెప్టెంబర్ 1న బాలయ్యకు ఘన సన్మానం
చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా మాకే సొంతం అని నందమూరి బాలకృష్ణ అంటుంటారు. అది ఆయన సీరియస్ గా అంటారో లేక సరదాగా అంటారో కానీ... అది నిజమే అనిపిస్తుంది. ఈరోజుతో సినీ నటుడిగా ఆయన 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. 1974 ఆగస్ట్ 30న అంటే సరిగ్గా ఇదే రోజున విడుదలైన 'తాతమ్మ కల' చిత్రంతో సినీ పరిశ్రమలోకి బాలయ్య అడుగుపెట్టారు. సాధారణంగా 30 ఏళ్లు లేదా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న హీరోలు ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రలకు షిఫ్ట్ అవుతారు. బాలయ్య మాత్రం ఇప్పటికీ హీరోగానే కొనసాగుతున్నారు. 

ఇటీవలి కాలంలో బాలయ్య నటించిన ప్రతి సినిమా రూ. 100 కోట్ల మార్కును దాటుతోంది. తన సినీ ప్రయాణంలో బాలయ్య ఎన్నో ఘన విజయాలను సాధించారు. తన తండ్రి ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... తిరుగులేని నటుడిగా కొనసాగుతున్నారు. నటుడిగా 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న బాలయ్యను సినీ పరిశ్రమ ఘనంగా సన్మానించబోతోంది. సెప్టెంబర్ 1న దక్షిణాది సినీ పరిశ్రమలోని అతిరథ మహారథుల సమక్షంలో ఆయనకు ఘన సన్మానం చేయబోతున్నారు.


More Telugu News