కాంగ్రెస్‌లోనే ఉంటా... పవన్ కల్యాణ్‌ను మాత్రం విమర్శించను: బండ్ల గణేశ్

  • గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ ప్రెస్ మీట్ సందర్భంగా పేర్కొన్న బండ్ల గణేశ్
  • ప్రాణం పోయినా పవన్ కల్యాణ్‌ను మాత్రం విమర్శించనని వ్యాఖ్య
  • తాను కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటున్నానన్న బండ్ల గణేశ్
తాను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, అయితే కలలో కూడా పవన్ కల్యాణ్‌ను మాత్రం విమర్శించనని ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

ప్రాణం పోయినా తాను పవన్‌ను విమర్శించనన్నారు. అధికారంలో ఉంటే ఒకలా, లేకుంటే మరోలా మాట్లాడే స్వభావం తనది కాదన్నారు. తన మనసుకు నచ్చకుంటే దేవుడినైనా ఎదిరిస్తానని, నచ్చితే కాళ్లు పట్టుకుంటానన్నారు.

తాను కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అన్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా పవన్ కల్యాణ్‌ను విమర్శించనన్నారు. తన ఇంట్లో, బెడ్రూంలో కూడా ఆయన ఫొటో ఉంటుందని తెలిపారు.

గతంలో ఓ సమయంలో మీరు పవన్‌ను తక్కువ చేసి మాట్లాడారు కదా! అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు, బండ్ల గణేశ్ పైవిధంగా సమాధానం చెప్పారు.


More Telugu News