మరికొన్ని రోజులు జైల్లోనే కేజ్రీవాల్... బెయిల్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వ్
- ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు
- ఈ నెల 10న తీర్పును వెలువరిస్తానని వెల్లడి
- కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ సెప్టెంబర్ 11 వరకు పొడిగింపు
మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఈ నెల 10న తీర్పును వెలువరించనున్నట్లు తెలిపింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్నిరోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కేజ్రీవాల్ అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు, ఆయన జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 11 వరకు పొడిగించింది.
మద్యం పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సీబీఐ తీరును తప్పుబట్టారు. మద్యం పాలసీ కేసు నమోదయిన రెండేళ్ల తర్వాత సీఎంను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ రాగానే సీబీఐ 'ఇన్స్యూరెన్స్ అరెస్ట్' చేసిందన్నారు. ఇది ఆయనను జైలు నుంచి బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నమేనని ఆరోపించారు. అరెస్టుకు ముందు నోటీసులు ఇవ్వలేదన్నారు.
దీంతో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కస్టడీలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని, ఈ నిబంధనలను ఎందుకు పాటించలేదని ధర్మాసనం ప్రశ్నించింది.
మరోవైపు, బెయిల్ పిటిషన్‌పై కేజ్రీవాల్ తీరును సీబీఐ తప్పుబట్టింది. ఆయన తన అరెస్టును సెషన్స్ కోర్టులో సవాల్ చేయకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లినట్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.