టీ20ల్లో ఆస్ట్రేలియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే!

  • స్కాట్‌లాండ్‌తో జరిగిన రెండో టీ 20 మ్యాచ్ లో చెలరేగిన బ్యాట్స్ ‌మెన్ జోష్ ఇంగ్లిస్
  • మెరుపు ఇన్నింగ్స్ ఆడి రికార్డు సాధించిన జోష్ 
  • 43 బంతుల్లో సెంచరీ పూర్తి
స్కాట్‌లాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో టీ 20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా జోష్ రికార్డు కైవసం చేసుకున్నాడు. 43 బంతుల్లోనే జోష్ సెంచరీ పూర్తి చేశాడు. 

2013లో 47 బంతుల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్ సెంచరీ చేయగా, ఇప్పుడు జోష్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. జోష్ ఇంగ్లిస్ సెంచరీతో రెండో టీ 20 లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా, జోష్ 49 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్ లో ఏడు సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. అంతర్జాతీయ టీ 20 లో జోష్‌కి ఇది రెండో సెంచరీ.   
 
టీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డులను ఒకసారి పరిశీలిస్తే 2013లో 47 బంతుల్లో అరోన్ ఫించ్, 2016లో 49 బంతుల్లో గ్లెస్ మాక్స్ వెల్, 2023లో 47 బంతుల్లో జోష్ ఇంగ్లిస్, గ్లెస్ మాక్స్ వెల్ సెంచరీ చేశారు.


More Telugu News