దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో నెట్ వర్క్ డౌన్... కస్టమర్ల విమర్శలు

  • ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమస్య
  • హైదరాబాద్ లో కూడా వినియోగదారులపై ప్రభావం
  • ఇంతవరకు అధికారికంగా స్పందించని జియో
దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ మధ్యాహ్నం జియో నెట్ వర్క్ డౌన్ అయింది. పెద్ద సంఖ్యలో వినియోగదారులు కాల్ డ్రాప్ సమస్యను ఎదుర్కొన్నారు. ఉదయం 11 గంటలకు సమస్య ప్రారంభమయింది. 67 శాతం మందికి సిగ్నల్ లేదని, 19 శాతం మందికి మొబైల్ ఇంటర్ నెట్ సమస్యలు తలెత్తాయని రిపోర్టులు వచ్చాయి. 14 శాతం మంది జియో ఫైబర్ సమస్యను ఎదుర్కొన్నారు. 

నెట్ వర్క్ సమస్యలు తలెత్తడంతో సోషల్ మీడియా వేదికగా కస్టమర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. డౌన్ డిటెక్టర్ ట్రాకర్ నివేదిక ప్రకారం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, చెన్నై, నాసిక్, కోల్ కతా, గౌహతి, పాట్నా ప్రాంతాల్లోని వినియోగదారులపై ఎక్కువ ప్రభావం పడింది. సమస్యపై జియో ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.


More Telugu News