అందుకే ఎక్కడికీ వెళ్లడం లేదని శోభన్ బాబుగారు చెప్పారు: హరిత గోగినేని
- 'ఫియర్'తో మెగాఫోన్ పట్టిన హరిత
- శోభన్ బాబుగారు తన పెదనాన్న అని వెల్లడి
- ఆయనతో చనువు ఎక్కువేనని వివరణ
- నాపై ఆయనకి ఎక్కువ నమ్మకం ఉండేదని వ్యాఖ్య
'లక్కీ లక్ష్మణ్' సినిమాతో నిర్మాతగా మారిన హరిత గోగినేని, 'ఫియర్' సినిమాతో దర్శకురాలిగా మారారు. తాజాగా 'ఫిల్మీ లుక్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. ఆ సమయంలోనే శోభన్ బాబుతో తనకి గల అనుబంధం గురించి చెప్పారు.
"శోభన్ బాబు గారు వరుసకు నాకు పెదనాన్న అవుతారు. మా తాతగారి ఊరు చిన నందిగామ. నేను పుట్టింది .. పెరిగింది అక్కడే. శోభన్ బాబుగారి ఊరు కూడా అదే. ఆ ఊరిలో శోభన్ బాబుగారి ఇల్లు చాలా పెద్దది. పెద్దపెద్ద గోడలను కలిగిన ఇల్లు ఆ ఊరిలో అదొక్కటే. అప్పుడపుడు శోభన్ బాబుగారు మా ఊరు వచ్చేవారు. అప్పుడు నేను వాళ్ల ఇంట్లోనే ఉండేదానిని. తినడానికి నాకు ఏదో ఒకటి ఇస్తూ నాతో కబుర్లు చెబుతూ ఉండేవారు" అని అన్నారు.
"శోభన్ బాబుగారితో చనువుగా మాట్లాడేది నేను మాత్రమే. ఆయన చనిపోవడానికి రెండు నెలల ముందు కూడా నేను చెన్నైలో వాళ్ల ఇంటికి వెళ్లాను. ఫంక్షన్స్ కి బయటికి వెళ్లకపోవడానికి కారణం ఏమిటని అప్పుడే ఆయనను అడిగాను. "నేను హీరోగా తెరపై ఎలా కనిపించానో అలాగే అందరికీ గుర్తుండాలి. అందువల్లనే ఎక్కడికీ వెళ్లడం లేదు" అని ఆయన చెప్పారు. జీవితంలో నేను తప్పకుండా పైకొస్తానని అంటూ ఉండేవారని అన్నారు.