అరుదైన తెల్లపులి, మొసళ్లను తరలిస్తుండగా వాహనం బోల్తా.. తప్పించుకునే ప్రయత్నం చేసిన మొసళ్లు

    
అరుదైన తెల్లపులి, మొసళ్లను తరలిస్తుండగా వాహనం బోల్తా.. తప్పించుకునే ప్రయత్నం చేసిన మొసళ్లు
బీహార్ రాజధాని పాట్నాలోని సంజయ్‌గాంధీ జాతీయ పార్క్ నుంచి రెండు వాహనాల్లో అరుదైన తెల్లపులి, మొసళ్లను తరలిస్తున్న వాహనం బోల్తాపడింది. బెంగళూరులోని బన్నేరుఘట్ట జాతీయ జూపార్క్‌కు వెళ్తున్న వాహనాల్లో ఒకటి తెలంగాణలోని నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట గ్రామం వద్ద నిన్న అదుపుతప్పి బోల్తాపడింది. 

దీంతో వాహనంలోని 8 మొసళ్లలో రెండు బయటపడి తప్పించుకునే ప్రయత్నం చేశాయి. అది చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్థానిక అటవీశాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని మొసళ్లను బంధించారు. మరో వాహనాన్ని సిద్ధం చేసి బెంగళూరు తరలించారు.


More Telugu News