రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
- కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్
- ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్
- ప్రకటన విడుదల చేసిన ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవులు 2025 మార్చితో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో, ఆ రెండు స్థానాలకు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది.
కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్... తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ లను టీడీపీ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
కాగా, వైసీపీ కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కృష్ణా-గుంటూరు జిల్లాల అభ్యర్థిగా పొన్నూరు గౌతమ్ రెడ్డి పేరును ఖరారు చేసింది.