మహారాష్ట్ర ఎన్నికలకు అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ

  • మహారాష్ట్రలో నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు
  • ఈ నెల 22న నోటిఫికేషన్
  • నేడు తొలి జాబితా ప్రకటించిన బీజేపీ హైకమాండ్
మహారాష్ట్రలో నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, జాబితాల విడుదల వంటి పనులతో బిజీగా ఉన్నాయి. తాజాగా, బీజేపీ కూడా అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 99 మంది అభ్యర్థులతో బీజేపీ నేడు తొలి జాబితా ప్రకటించింది. 

డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఆయన నాగపూర్ నైరుతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాంకులే కంతి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్ భోకర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 

బీజేపీ తొలి జాబితాలో... ముంబయి బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ సేలార్, లోక్ సభ ఎంపీ నారాయణ్ రాణే కుమారుడు నితీశ్ రాణే కూడా చోటు దక్కించుకున్నారు. 

మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా, అన్నింటికీ ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. త్వరలోనే బీజేపీ తన తదుపరి జాబితా విడుదల చేయనుంది.


More Telugu News