నవంబరు నెలలో వివిధ బ్యాంకులకు సెలవులు ఇవే!

  • నవంబర్ నెలకు సంబంధించి బ్యాంకు హాలిడేస్ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఆర్బీఐ
  • ఈ నెలలో 12 రోజులు బ్యాంకు సెలవులు
  • ఆదివారంతో పాటు రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులకు సెలవులే
నవంబర్ నెల ప్రారంభం అయింది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఓ వైపు బ్యాంకు సిబ్బంది, మరో వైపు ఖాతాదారులకు తెలిసేందుకు గానూ నవంబర్ 2024 బ్యాంక్ సెలవుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సాధారణంగా ఆదివారంతో పాటు రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులకు సెలవులే. ఇవి కాకుండా ఈ నెలలో వచ్చే పండుగలతో పాటు ఈవెంట్లు, ఇతర కార్యక్రమాలతో కలుపుకొని మొత్తం నవంబర్ నెలలో 12 రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవులను ఈ సందర్భంగా ఆర్బీఐ వివరించింది. 

నవంబర్ 1: దీపావళి సందర్భంగా త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్ లోని బ్యాంకులకు సెలవు. ఇక కర్ణాటకలో నవంబర్ 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించింది. 

నవంబర్ 2: దీపావళి, లక్ష్మీ, గోవర్థన్ పూజల కారణంగా.. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఈ రోజు సెలవు దినంగా పేర్కొంది.
 
నవంబర్ 3: ఆదివారం కావడంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులు సైతం మూసివేసి ఉంటాయన్న సంగతి తెలిసిందే. 

నవంబర్ 7: చాత్ పండుగ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లోని బ్యాంకులు మూసి ఉంటాయి. 

నవంబర్ 8: వంగల పండుగ కారణంగా బీహార్, జార్ఖండ్, మేఘాలయ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు

నవంబర్ 9: రెండో శనివారం

నవంబర్ 10: ఆదివారం

నవంబర్ 15: కార్తీక పౌర్ణమితో పాటు గురునానక్ జయంతి. దీంతో మిజోరాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛండీగఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ లోని అన్ని బ్యాంకులకు సెలవు.

నవంబర్ 17: ఆదివారం

నవంబర్ 18: కనకాదాసు జయంతి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని అన్ని బ్యాంకులకు సెలవు

నవంబర్ 23: నాలుగో శనివారం, అంతే కాక మేఘాలయాలో సెంగ్ కుట్స్నెమ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు.

నవంబర్ 24: ఆదివారం.


More Telugu News