టోల్ ఫ్రీ నెం.1967 పనితీరును పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్
- ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం ప్రారంభించిన ఏపీ సర్కారు
- సమస్యల పరిష్కారం కోసం 1967 టోల్ ఫ్రీ నెంబరు
- 1967 టోల్ ఫ్రీ నెంబరు కార్యాలయానికి వెళ్లిన మంత్రి నాదెండ్ల
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం-2) పంపిణీలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు సంప్రదించడానికి 1967 టోల్ ఫ్రీ నెంబరును అందబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో, 1967 టోల్ ఫ్రీ నెంబరు పనితీరు ఎలా ఉందన్న విషయాన్ని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు స్వయంగా పరిశీలించారు.
విజయవాడ లోని పౌరసరఫరాల భవన్ లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1967 కార్యాలయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. అధికారులు ఈ సందర్భంగా దీపం-2 పథకం వివరాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దీపావళి నుండి అందిస్తున్న దీపం -2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు బుక్ అయినవి 16,47,000 సిలిండర్లు కాగా... సమాచారం కోసం టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి 3000 మంది తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఇలా ఉచిత సిలెండర్ కోసం బుక్ చేసుకున్న దీపం -2 లబ్దిదారులకు ఆయిల్ కంపెనీల నుంచి ఇలా మెసేజ్ వస్తుంది. "మొదటి సిలిండర్ కోసం నమోదు చేసుకొన్నందుకు శుభాకాంక్షలు. లబ్ధిదారులు సిలిండర్ కై ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. ఈ చెల్లించిన అమౌంట్, మీరు సిలిండర్ డెలివరీ తీసుకున్న 48 గంటలలో మీ బ్యాంకు ఖాతా నందు జమ చేయబడుతుందని తెలియచేస్తున్నాము" అని వినిపిస్తుంది.
ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు
1)ఎల్.పి.జి.కనెక్షన్ కలిగి ఉండటం
2) రైస్ కార్డ్
3) ఆథార్ కార్డు
4). ఆధార్ కార్డుతో రైస్ కార్డు అనుసంధానం అయి ఉండాలి.
బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సహకరించండి: మంత్రి నాదెండ్ల
విజయవాడలో జాతీయ రైస్ మిల్లర్స్ అసోయేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు అందరూ ఇక్కడకు రావడం ఆనందంగా ఉందని నాదెండ్ల తెలిపారు. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సహకరించండి అని మిల్లర్లకు పిలుపునిచ్చారు. బియ్యం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సహకరిస్తామని మిల్లర్లు హామీ ఇచ్చారు.
రూ.9,800 కోట్లు టర్నోవర్ ఉన్న పౌరసరఫరాల శాఖలో రూ.41,150 కోట్లు బకాయిలు చేసి గత ప్రభుత్వం వెళ్లిపోయిందని నాదెండ్ల ఆరోపించారు. సీఎం చంద్రబాబుతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రైతుల బకాయిలపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని, వారి సహకారంతో రైతులకు నెల రోజుల్లో రూ.1,674 కోట్ల బకాయిలు చెల్లించామని నాదెండ్ల వెల్లడించారు.
అదే సమయంలో రైస్ మిల్లర్స్ గురించి కూడా ఆలోచన చేశామని, మిల్లర్లపై మార్కెట్ సెస్ 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని మంత్రుల సమావేశంలో చర్చించినట్లు మంత్రి నాదెండ్ల గుర్తుచేశారు.
ఏపీ సచివాలయంలో ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ భేటీ
రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బియ్యం, కందిపప్పు, టమోటా, ఉల్లి ధరల నియంత్రణపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుత మార్కెట్ లో ధరల పరిస్ధితిని సమీక్షించారు.
ధరల స్ధిరీకరణ కోసం రూ.500 కోట్లతో నిధి ఏర్పాటుకు ప్రభుత్వ ఆలోచన చేస్తున్నట్టు మంత్రులు పేర్కొన్నారు. సంస్కరణలో భాగముగా 2 శాతం ఉన్న మార్కెట్ రుసుము (cess) 1 శాతానికి తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు.