ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం
  • హర్షం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
  • మోదీ నాయకత్వ సత్తాకు నిదర్శనమని వెల్లడి 
మహారాష్ట్రలో మహాయుతి (ఎన్డీయే) కూటమి గ్రాండ్ విక్టరీ సాధించడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్డీయే కూటమి మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించి, మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుండడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 

ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా చంద్రబాబు కంగ్రాట్స్ చెప్పారు.  ఈ విజయం ఎన్డీఏ పాలనకు, మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని అభివర్ణించారు.


More Telugu News