రెహమాన్ నాకు తండ్రితో సమానం.. ఇప్పటికైనా వాటికి ఫుల్స్టాప్ పెట్టండి: బాసిస్ట్ మోహినిదే
- రెహమాన్ దంపతుల విడాకులతో లింక్ చేస్తూ వస్తోన్న వార్తలపై మరోసారి స్పందించిన మోహినిదే
- తమపై ఇలాంటి వార్తలు రావడం చాలా బాధాకరమన్న బాసిస్ట్
- ఆయన ఎప్పుడూ తనను తన కుమార్తెలానే చూశారన్న మోహినిదే
ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సైరా బాను దంపతులు తమ 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ విడాకుల ప్రకటన వచ్చిన కాసేపటికే తన భర్త నుంచి విడిపోతున్నట్లు బాసిస్ట్ మోహినిదే వెల్లడించడంతో వారిద్దరిని లింక్ చేస్తూ పుకార్లు పుట్టుకొచ్చాయి.
సామాజిక మాధ్యమాల్లో చాలా మంది ఈ విషయమై నెగటివ్‌గా మాట్లాడటం చేశారు. దాంతో ఇటీవల ఈ విషయంపై స్పందించిన మోహినిదే ఆ రూమర్లను తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు మరోసారి ఈ అంశంపై ఆమె స్పందించారు.
ఏఆర్ రెహమాన్ తనకు తండ్రితో సమానమని చెప్పారు. "ఏఆర్ రెహమాన్ నాకు తండ్రితో సమానం. ఎనిమిది ఏళ్ల నుంచి ఆయన బృందంలో పనిచేస్తున్నాను" అని మోహిని పేర్కొన్నారు. తమపై ఇలాంటి వార్తలు రావడం చాలా బాధించిందని ఆమె తెలిపారు.
రెహమాన్ కుమార్తెలది, తనది ఒకే వయసు ఉంటుందని, ఆయన ఎప్పుడూ తనను తన కుమార్తెలానే చూశారని మోహినిదే అన్నారు. తన కెరీర్లో ఆయన కీలకపాత్ర పోషించారని, తన జీవితానికి రెహమన్ రోల్‌మోడల్ అని పేర్కొన్నారు. తమపై ఇలాంటి రూమర్స్ రావడం బాధాకరం అన్నారు. అసభ్యకరంగా మాట్లాడడం నేరంగా పరిగణించాలని తెలిపారు.
ఇక ఇలాంటి వార్తలు తన కెరీర్‌కు అంతరాయం కలిగించలేవన్నారు. దయచేసి ఇలాంటి వాటికి ఇక్కడితో ఫుల్స్టాప్ పెట్టి, తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని మోహినిదే కోరారు.
ఇక రెహమాన్ పిల్లలు కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదన్నారు. రెహమాన్ కుమారుడు అమీన్ చెబుతూ.. తన తల్లిదండ్రులు విడిపోవడాన్ని బాసిస్ట్ మోహినిదేతో లింక్ చేయడాన్ని నిరాధార పుకార్లుగా కొట్టిపారేశారు.
అటు ఆయన కుమార్తె రహీమా కూడా ఇదే విషయమై తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఖండించారు. ఆ మధ్య రెహమాన్ భార్య సైరా తరఫు న్యాయవాది వందనా షా కూడా ఈ లింక్‌పై స్పందించారు. ఇందులో ఎటువంటి నిజం లేదని స్పష్టత ఇచ్చారు.