వర్మ గురించి అడిగిన మీడియా... హోంశాఖ, శాంతిభద్రతలు తన పరిధిలో లేవన్న పవన్ కల్యాణ్

  • వర్మ వ్యవహారంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • పోలీసులను వారి పని వారిని చేసుకోనివ్వాలన్న పవన్
  • నా పని నేను చేసుకుంటా అని వెల్లడి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యవహారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నారని మీడియా పవన్ ను ప్రశ్నించింది. అందుకు పవన్ స్పందిస్తూ...  హోంశాఖ, శాంతిభద్రతలు తన పరిధిలో లేవని స్పష్టం చేశారు. పోలీసులను వారి పని వారిని చేసుకోనివ్వండి... నా పని నేను చేసుకుంటా అని పేర్కొన్నారు. నేను ఏం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుందని అన్నారు. 

మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవారిని పట్టుకోవడంలో తటపటాయింపు ఎందుకని మీడియా అడుగుతోందని... మీడియా నన్ను అడిగిన ప్రశ్నలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనం లేవని విమర్శించారు. సమోసాల కోసమే గత ప్రభుత్వం రూ.9 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.

పవన్ కల్యాణ్ ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రులు సీఆర్ పాటిల్, గజేంద్ర షెకావత్ లను కలిశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.


More Telugu News