నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో కొండా సురేఖకు కోర్టు సమన్లు
- కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పరువు నష్టం దావా
- నాగార్జున వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు
- డిసెంబర్ 12న విచారణకు హాజరు కావాలని మంత్రికి ఆదేశం
ప్రముఖ నటుడు నాగార్జున పరువు నష్టం కేసులో తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. కొండా సురేఖపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. తనపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.
దీనిని విచారించిన న్యాయస్థానం పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంది. మంత్రికి సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు జరిగే విచారణకు మంత్రి హాజరు కావాలని ఆదేశించింది.
నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేశారు. ఈ రెండు కేసుల్లోనూ పిటిషనర్ల వాదనలను కోర్టు రికార్డ్ చేసింది.