లివర్ ను సహజంగా క్లీన్ చేసే ఆహారం ఇదే!
- మారిన జీవన శైలితో కాలేయంపై పెరుగుతున్న ఒత్తిడి
- దాని పనితీరు దెబ్బతింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు
- కొన్ని రకాల ఆహారంతో లివర్ పునరుత్తేజం చెందుతుందంటున్న ఆరోగ్య నిపుణులు
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. రక్తంలోని విష పదార్థాలు, వ్యర్థాలను తొలగించడంతోపాటు... మనం తినే ఆహారం సరిగా జీర్ణం కావడానికి కాలేయమే కీలకం. కానీ మన ఆహార అలవాట్లలో మార్పులు, ఆల్కహాల్ వినియోగం, జీవన శైలిలో మార్పుల వల్ల కాలేయంపై ఒత్తిడి పెరుగుతోంది. ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వస్తున్నాయి.
అయితే కాలేయానికి తనంతట తాను మరమ్మతు చేసుకునే శక్తి ఉంటుందని... ఇందుకోసం కొన్ని రకాల ఆహార పదార్థాలు తోడ్పడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారాన్ని మన రోజువారీ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ఆ ఆహార పదార్థాలు ఏవంటే...
వెల్లుల్లి...
దీనిలో సల్ఫర్ ఆధారిత రసాయన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపేందుకు కాలేయం ఉత్పత్తి చేసే ఎంజైముల తయారీలో ఆ రసాయన సమ్మేళనాలు తోడ్పడుతాయి. ఇక వెల్లుల్లిలోని అల్లిసిన్, సెలీనియం రెండూ కూడా కాలేయాన్ని రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బీట్ రూట్...
వీటిలోని బెటాలైన్స్ గా పిలిచే రసాయన సమ్మేళనాలు కాలేయం ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయని... విష పదార్థాలను బయటికి పంపడంలో తోడుగా నిలుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ బీట్ రూట్ రసం తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుందని వివరిస్తున్నారు.
గ్రీన్ టీ...
గ్రీన్ టీలో కెటచిన్స్ గా పిలిచే రసాయన సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. అవి కాలేయం పనితీరును మెరుగుపర్చి, వ్యాధులు రాకుండా చూస్తాయి. తరచూ గ్రీన్ టీ తీసుకుంటే... లివర్ ఎంజైమ్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
ఆకుకూరలు, కూరగాయలు...
ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, కూరగాయల్లో అధికంగా ఉండే క్లోరోఫిల్... లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలోని భార ఖనిజాలు, రసాయనాలు, పురుగు మందుల అవశేషాలను తొలగించడంలో లివర్ కు సాయపడుతుంది.
ఆలివ్ ఆయిల్...
ఆలివ్ ఆయిల్ లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు... శరీరంలో కొన్నిరకాల విష పదార్థాలను శోషించుకుంటాయి. తద్వారా కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ముఖ్యంగా ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం వల్ల లాభం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాల్ నట్స్..
వీటిలో అర్జినైన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉంటుంది. అది శరీరంలో ఉత్పన్నమయ్యే అమ్మోనియాను తొలగించడంలో కాలేయానికి సాయపడుతుంది. ఇక వాల్ నట్స్ లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, గ్లుటాథియాన్ వంటివి కాలేయం పనితీరును మెరుగుపర్చి వ్యాధులు రాకుండా చూస్తాయి.

ఇక పసుపులోని కర్క్యుమిన్ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తూ.. కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది. - నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో అధికంగా ఉండే ‘విటమిన్ సీ’ తోనూ శరీరంలో విష పదార్థాలు తొలగిపోయి... కాలేయం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
- యాపిల్స్ లో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ శరీరంలో విష పదార్థాలను తొలగించి, కాలేయానికి తోడ్పడుతుంది.