సెన్షేషనలిజం నిజాన్ని దాచబోదు.. మీడియాపై శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ఫైర్
- అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో నిన్న రాజ్‌కుంద్రా నివాసం, కార్యాలయాల్లో దాడులు
- తన భార్య పేరును పదేపదే ఇందులోకి లాగుతున్నారని రాజ్‌కుంద్రా ఫైర్
- సెన్షేషనలిజం నిజానికి కమ్మేస్తుందన్న వ్యాపారవేత్త
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా తీవ్రంగా స్పందించారు. అశ్లీల చిత్రాలతో ముడిపడిన మనీ ల్యాండరింగ్ కేసులో నిన్న ఈడీ రాజ్‌కుంద్రా నివాసం, కార్యాలయాలతోపాటు ఆయన సన్నిహితుల కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించింది. తాజాగా ఈ దాడులపై రాజ్‌కుంద్రా స్పందించారు. ‘వాస్తవాన్ని సంచలనం దాచబోదు’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసుతో తన భార్య శిల్పాశెట్టిని ముడిపెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. ఇది ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియాలో నాటకీయత ఉన్నట్టు కనిపిస్తోందన్న కుంద్రా.. గత నాలుగేళ్లుగా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నట్టు చెప్పారు. ‘సహచరులు’, ‘పోర్నోగ్రఫీ’, ‘మనీలాండరింగ్’ వంటి పదాలు ఎంతటి సంచలనం సృష్టించినా నిజాన్ని మరుగుపరచలేవని, చివరికి న్యాయమే గెలుస్తుందని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో పేర్కొన్నారు. సంబంధం లేని విషయంలోకి తన భార్య పేరును పదేపదే లాగడం ఆమోదయోగ్యం కాదన్నారు. హద్దులను గౌరవించాలని సూచించారు.
పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, ఎఫ్ఐఆర్లోనూ తన పేరు లేదని, తనను ఇరికించారని రాజ్‌కుంద్రా ఆరోపించారు. ఇద్దరు మహిళల ఫిర్యాదుతో రాజ్‌కుంద్రాపై అశ్లీల చిత్రాల కేసు నమోదైంది. ఔత్సాహిక నటులకు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని, ముంబైలోని పలు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లలో అశ్లీల వెబ్ సిరీస్‌లు, షార్ట్ స్టోరీలు నిర్మించినట్టు రాజ్‌కుంద్రాపై అభియోగాలున్నాయి.
అలా చిత్రీకరించిన వాటిని సబ్స్క్రిప్షన్ ఆధారిత ఓటీటీల్లో విడుదల చేసి సొమ్ము చేసుకునే వారని పోలీసులు ఆరోపిస్తున్నారు. కుంద్రా ఫోన్ వాట్సాప్ చాట్స్‌లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చాటింగ్‌లను పోలీసులు కనుగొన్నారు. ఇందులో 119 అశ్లీల చిత్రాలను ఓ వ్యక్తికి 1.2 మిలియన్ డాలర్లకు విక్రయించడానికి సంబంధించి చర్చ జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు.