తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటన
- కొలువుదీరిన టీటీడీ నూతన పాలకమండలి
- ఇటీవల తొలి సమావేశం
- ప్రతి నెల మొదటి మంగళవారం తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం
- డిసెంబరు 3 నుంచి అమలు చేస్తున్నామన్న బీఆర్ నాయుడు
ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలి కొలువుదీరిన సంగతి తెలిసిందే. టీవీ5 చానల్ అధినేత బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం నాడు శ్రీవారి దర్శనం కల్పించాలన్నది ఆ నిర్ణయాల్లో ఒకటి.
దీనిపై ఇవాళ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటన చేశారు. టీటీడీ కొత్త పాలకవర్గం తొలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలు చేస్తున్నామని తెలిపారు. తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్, చంద్రగిరి మండలం, రేణిగుంట మండల ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. ఈ మేరకు టీటీడీ సిద్ధమైందని... ఈ నిర్ణయం 2024 డిసెంబరు 3 (మంగళవారం) నుంచి అమల్లోకి రానుందని బీఆర్ నాయుడు వివరించారు.