రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్యుల దుర్మరణం
- అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద ఘటన
- అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న కారు
- మృతి చెందిన ముగ్గురు బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుగా గుర్తింపు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్యులు దుర్మరణం పాలైన ఘటన అనంతపురం జిల్లాలో ఈ వేకువజామున జరిగింది. బళ్లారికి చెందిన వైద్యులు హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు విడపనకల్లు వద్ద అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ప్రమాదంతో కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్ మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ముగ్గురు బళ్లారి ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులుగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రమైన మంచు ప్రభావం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.