సచిన్ రికార్డును బద్దలుగొట్టిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్

  • న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం
  • రూట్‌కు ఇది 150వ టెస్ట్ మ్యాచ్
  • నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌, క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్‌లో కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రూట్‌కు ఇది 150వ టెస్ట్. రెండో ఇన్నింగ్స్‌లో 15 బంతుల్లో 23 పరుగులు చేసిన రూట్.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుగొట్టాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 

1,625 పరుగులతో సచిన్ ఇప్పటి వరకు ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉండగా రూట్ 1,630 పరుగులతో అతడిని అధిగమించాడు. అలిస్టర్ కుక్, గ్రేమ్ స్మిత్ చెరో 1,611 పరుగులతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. వెస్టిండీస్ గ్రేట్ శివ్‌నరైన్ చందర్‌పాల్ 1,580 పరుగులతో టాప్-5లో ఉన్నాడు. 


More Telugu News