రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట

  • వర్మపై మార్ఫింగ్ ఫొటోల కేసులు
  • కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టులో వర్మ క్వాష్ పిటిషన్
  • 9వ తేదీ వరకు వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన కేసులకు సంబంధించి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి (9వ తేదీ) వాయిదా వేసింది. 9వ తేదీ వరకు వర్మపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. 

మరోవైపు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వర్మ స్పందించలేదు. పోలీసు విచారణకు ఆయన ఇప్పటి వరకు హాజరుకాలేదు. ఓవైపు ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఆయన మాత్రం మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ పోలీసులకు షాకిస్తున్నారు.


More Telugu News