హైదరాబాదులో అదిరిపోయేలా పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్

  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2 ది రూల్
  • డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు
  • యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నేడు ప్రీ రిలీజ్ వేడుక
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప-2 ది రూల్ డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే పాట్నా, కొచ్చి, ముంబయి నగరాల్లో భారీ ఈవెంట్లతో పుష్ప టీమ్ హంగామా చేసింది. 

ఈ క్రమంలో నేడు హైదరాబాదులో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేలాదిగా ఫ్యాన్స్ తరలివచ్చారు. 

ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన్న, యువ నటి శ్రీలీల తదితరులు హాజరయ్యారు. అంతేకాదు, దర్శకులు రాజమౌళి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సానా కూడా విచ్చేశారు. 



More Telugu News