ఈ నెల 22న పీవీ సింధు వివాహం .. వరుడు ఎవరంటే..!

  • హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయిని వివాహం చేసుకోబోతున్న పీవీ సింధు
  • రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం .. హైదరాబాద్‌లో 24న రిసెప్షన్
  • వివరాలు వెల్లడించిన సింధు తండ్రి రమణ
భారత స్టార్ షట్టర్ పీవీ సింధు వివాహ వేడుకకు మూహూర్తం ఫిక్స్ అయింది. వరుసగా రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించి తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సాధించిన సింధు .. రెండేళ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలో మొన్న జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి వులుయో యును వరుస గేమ్‌ల్లో చిత్తు చేసి విజయం సాధించింది. 

ఈ తరుణంలో సింధు వివాహ ముహూర్తం ఖరారు కావడంతో ఆమె తండ్రి పీవీ రమణ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో సింధు పెళ్లి ఖాయమైందని, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ నెల 22న పెళ్లి జరగనుందని ఆయన తెలిపారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెళ్లికి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు ఈ నెల 20న ప్రారంభం కానున్నాయని తెలిపారు. 

సాయి కుటుంబం తమకు చాలా కాలంగా తెలుసునని, గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించి నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. జనవరి నుంచి సింధు షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఈ నెలలోనే పెళ్లి మూహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిపారు. ఇక సింధు వివాహం చేసుకోబోతున్న వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 
 


More Telugu News