కేంద్ర మంత్రులతో కలిసి 'ది సబర్మతి రిపోర్టు' చిత్రాన్ని చూసిన మోదీ
- గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా 'ది సబర్మతి రిపోర్టు' చిత్రం
- పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర మంత్రులతో కలిసి చిత్రాన్ని వీక్షించిన ప్రధాని మోదీ
- సామాన్యులకు కూడా అర్థమయ్యేరీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందన్న మోదీ
గుజరాత్‌లో 2002లో జరిగిన గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా 'ది సబర్మతి రిపోర్టు' సినిమాను తెరకెక్కించారు.
విక్రాంత్ మాస్కే, రాశీఖన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలక పాత్ర పోషించారు. నవంబర్ 15న ఈ సినిమా విడుదలైంది. కాగా, పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఇతర మంత్రులు, ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ ఈ చిత్రాన్ని వీక్షించారు.
ఇటీవల ఓ నెటిజన్ ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ స్పందించారు. కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు.