దుమ్మురేపిన పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఈ ఫొటోలు చూశారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా పుష్ప-2. పాన్ ఇండియా స్థాయిలో ఎల్లుండి (5న) విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గత రాత్రి హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన్న, యువ నటి శ్రీలీల, అనసూయ తదితరులు హాజరయ్యారు. అలాగే, దర్శకులు రాజమౌళి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సానా కూడా విచ్చేశారు. ఈవెంట్ కోసం ఏపీ, తెలంగాణలోని నలుమూలల నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరలివచ్చారు. ఈ సినిమాలో తాము భాగం అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరు చెప్పుకొచ్చారు.