భారతీయ బంధువులతో అమెరికా కాబోయే ఉపాధ్యక్షుడి ఫొటో
- భార్య తరఫు బంధువులతో జేడీ వాన్స్ సంబరాలు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటో
- ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫ్యామిలీ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో చుట్టూ భార్య తరఫు బంధువులతో, భుజాలపై కొడుకును కూర్చోబెట్టుకుని వాన్స్ నిలబడ్డారు. ఆయన చుట్టూ ఉన్నవారంతా భారతీయులే కావడం విశేషం. జేడీ వాన్స్ భార్య ఉష భారతీయురాలనే విషయం తెలిసిందే. ఆమె తరఫు బంధువులతో వాన్స్ థ్యాంక్స్ గివింగ్ పండుగ జరుపుకున్నపుడు ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ ఫొటో చూసిన నెటిజన్లు వాన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయులతో పూర్తిగా కలిసిపోయారని, భారతీయ స్టయిల్ లోనే కొడుకును భుజాలపై కూర్చోబెట్టుకున్నారని కామెంట్లు పెడుతున్నారు. స్వీట్ ఫ్యామిలీ అని, నిజమైన కుటుంబం అని, భారత సంప్రదాయంలో కలిసిపోయి కుటుంబంలోని పెద్దవారితో సరదాగా గడిపారంటూ జేడీ వాన్స్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.