సుకుమార్ భార్య తబిత ఆసక్తికర పోస్ట్.. పుష్ప మేకింగ్ గ్లింప్స్ పంచుకుంటూ ఎమోషనల్!
- ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పుష్ప2
- ప్రస్తుతం ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్రబృందం
- తాజాగా ఈ మూవీని ప్రస్తావిస్తూ సుక్కు భార్య ఎమోషనల్ పోస్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన తాజా చిత్రం పుష్ప2: ది రూల్. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం చిత్రం యూనిట్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా గత రాత్రి హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు చిత్ర నిర్మాతలు, దర్శకుడు, హీరోయిన్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఇదిలాఉంటే.. దర్శకుడు సుకుమార్ భార్య తబిత ఈ మూవీ నేపథ్యంలో చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు ప్రస్తుతం నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది. పుష్ప సినిమా కోసం సుక్కు, బన్నీ, ఇతర చిత్రబృందం ఎంతో కష్టపడ్డారని... ఈ మూవీ మేకింగ్ గ్లింప్స్ పంచుకుంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రం కేవలం ఇంట్రెస్టింగ్ మాత్రమే కాదని, ఓ ఎమోషనల్ అని ఆమె పేర్కొన్నారు.
ఇంట్లో ఉండి స్టోరీ చదివే దగ్గర నుంచి వేదికపై నిల్చుని అందరిచేత ప్రశంసలు అందుకునే వరకు మీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం అని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీ టాలెంట్, కృషిని ఎంతో మంది గుర్తిస్తారని చెప్పారు. మీ సక్సెస్‌లో మీ పక్కన ఉన్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని తబిత తెలిపారు. మీతో నా జర్నీ చాలా సంతోషాన్ని ఇస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.