అమరుడు శ్రీకాంతాచారి ఫొటోతో రేవంత్ రెడ్డి భావోద్వేగ ట్వీట్

  • తెలంగాణ గుండెలపై పచ్చబొట్టై నిలిచిపోతావని వ్యాఖ్య
  • శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం
  • తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మంగళవారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటోతో భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘నీ త్యాగం తెలంగాణ గుండెలపై పచ్చబొట్టుగా మారి శాశ్వతంగా నిలుస్తుంది‘ అంటూ శ్రీకాంతాచారిని కీర్తించారు. 

ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న శ్రీకాంతాచారి రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశాడు. 2009లో క్యాంపస్ లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు శరీరాన్ని కాల్చేస్తున్నా జై తెలంగాణ అంటూ నినదించాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా చివరి మాటల్లోనూ తెలంగాణ సాధించుకోవాలంటూ సహచరులకు చెప్పాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంతాచారి కన్నుమూశాడు.


More Telugu News