భార్య సాక్షితో కలిసి ధోనీ ట్రెడిషనల్ డ్యాన్స్... వీడియో వైరల్!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన సతీమణి సాక్షితో కలిసి ట్రెడిషనల్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజులుగా ఎంఎస్‌డీ తన ఫ్యామిలీతో కలిసి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా రిషికేశ్‌లో స్థానికులతో కలిసి ధోనీ దంపతులు కాలు కదిపారు. 'గులాబీ షరారా', 'పహదీ' పాటలకు ధోనీ, సాక్షి డ్యాన్స్ చేయడం వీడియోలో చూడొచ్చు.