అత్యవసరమైతే నా నెంబర్‌కు ఫోన్ చేయండి: విద్యార్థుల కోసం ఫోన్ నెంబర్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి

  • విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి
  • ర్యాంకుల పేరిట కాలేజీలు ఒత్తిడికి గురి చేయవద్దని సూచన
  • అవసరమైతే తన ఆఫీసు నెంబర్ 86880 07954కు ఫోన్ చేయాలని సూచన
అత్యవసరమైతే విద్యార్థులు తనను సంప్రదించవచ్చని... ఆత్మహత్య చేసుకోవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల మరణాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... పది రోజుల్లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య బాధాకరమన్నారు.

కాలేజీ యాజమాన్యం ర్యాంకుల పేరిట ఒత్తిడికి గురి చేసే విధానాలు విడనాడాలని సూచించారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అత్యవసరమైతే తన ఆఫీసు ఫోన్ నెంబర్ 86880 07954కు ఫోన్ చేయాలని విద్యార్థులకు సూచించారు. అంతేకాదు, minister.randbc@gmail.com ఈ-మెయిల్ ఐడీ ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.


More Telugu News