భారత్‌తో రెండో టెస్ట్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. జట్టులోకి ప్రమాదకర బౌలర్

  • ఈ నెల 6 నుంచి అడిలైడ్‌లో పింక్ టెస్ట్ ప్రారంభం
  • గాయం కారణంగా స్టార్ బౌలర్ హేజెల్‌వుడ్ దూరం
  • అతడి స్థానంలో స్కాట్ బోలాండ్‌కు స్థానం
  • 2021-22లో యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్ పనిపట్టిన బోలాండ్
  • ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లు నేలకూల్చిన బౌలర్
  • ఒకే ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి ఆతిథ్య జట్టు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో అడిలైడ్‌లో 6 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ (పింక్‌బాల్ టెస్ట్)కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. గాయం కారణంగా స్టార్ పేసర్ జోష్ హేజెల్‌వుడ్ ఈ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. అతడి స్థానంలో ప్రమాదకర బౌలర్ స్కాట్ బోలాండ్ జట్టులోకి వచ్చాడు. అతడి షార్ట్ కెరియర్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చినప్పటికీ సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు హేజెల్‌వుడ్ స్థానంలో అతడికి చోటు దక్కింది.

2021-22 యాషెస్ సిరీస్ మూడో టెస్టులో అరంగేట్రం చేసిన బోలాండ్ ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించాడు. ఏడు పరుగులిచ్చి ఏకంగా ఆరు వికెట్లు నేలకూల్చాడు. అతడి దెబ్బకు విలవిల్లాడిన ఇంగ్లండ్ 68 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటి వరకు 10 టెస్టులు ఆడిన బోలాండ్ 35 వికెట్లు తీసుకున్నాడు.

ఉస్మాన్ ఖావాజా, నాథన్ మెక్ స్వీనీ బ్యాటింగ్ ప్రారంభిస్తారు. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ వరుసగా బ్యాటింగ్ చేస్తారు. అలెక్స్ కేరీ వికెట్ కీపర్. బౌలింగ్ విషయానికి వస్తే పాట్ కమిన్స్ బౌలింగ్‌ దళాన్ని లీడ్ చేస్తాడు. మిచెల్ స్టార్క్, స్టాట్ బోలాండ్ పేసర్లు కాగా, ఒకే ఒక్క స్పిన్నర్ నాథన్ లియాన్‌తో బరిలోకి దిగుతోంది. 

ఆస్ట్రేలియా జట్టు: ఉస్మాన్ ఖావాజా, నాథన్ మెక్ స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్. 


More Telugu News