ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని దారుణంగా హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్

  • ఐఏసీ సంస్థ ఫౌండర్ బసవ రమణ దాష్టీకం
  • ఉద్యోగాల పేరిట‌ విద్యార్థుల వ‌ద్ద‌ రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేసిన వైనం
  • ఆ త‌ర్వాత వారిని శారీర‌కంగా హింసిస్తూ రాక్షసానందం పొందుతున్న‌ శాడిస్ట్
ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉద్యోగార్థుల నుంచి డబ్బులు తీసుకొని వారిని దారుణంగా హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా  ఐఏసీ (ఇండియన్ ఆర్మీ కాలింగ్) సంస్థ ఫౌండర్, అధ్య‌క్షుడు అయిన‌ బసవ రమణ అనే వ్యక్తి ఇలా యువ‌కుల‌ను శారీర‌కంగా హింసిస్తున్నాడు. ఒక‌రిద్ద‌రు కాదు కొన్ని వేలాదిమంది విద్యార్థులు అత‌ని బాధితులుగా ఉన్న‌ట్లు స‌మాచారం. వారి జీవితాలతో బసవ రమణ ఆడుకుంటున్నాడు. 

ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్సులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యంలో చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ ఓ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) యూజ‌ర్ మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేశారు. అన్నయ్య ఇది చాలా సీరియ‌స్ ఇష్యూ అని అత‌డు పేర్కొన్నాడు. విద్యార్థుల‌ను బసవ రమణ కేబుల్ వైర్‌తో కొడుతున్న వీడియోను కూడా ఈ ట్వీట్‌కు జోడించాడు. 


More Telugu News