హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ సైతం నివ్వెరపోతున్నాడు: హరీశ్ రావు
- అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపు
- బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు
- నివాళి అర్పించేందుకు వెళ్లనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకన్న హరీశ్
తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో, ఆపార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావును కూడా గృహనిర్బంధం చేశారు, ఈ నేపథ్యంలో తన నివాసం నుంచి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు.
ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమని సీఎం రేవంత్ పై మండిపడ్డారు. ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించావని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వైఖరిని చూసి హైదరాబాద్ నడిగడ్డపై ఉన్న అంబేద్కర్ సైతం నివ్వెరపోతున్నాడని అన్నారు. అదుపులోకి తీసుకున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.