హెడ్మాస్టర్ ను హత్య చేసి ఆయన బైక్ తో విద్యార్థి పరారీ
- మధ్యప్రదేశ్ లో ఘోరం
- హెడ్మాస్టర్ ను కాల్చి చంపిన విద్యార్థి
- తలకు గురిపెట్టి కాల్చిన వైనం
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ లో ఘోరం జరిగింది. ఓ విద్యార్థి హెడ్మాస్టర్ ను హత్య చేశాడు. సురేంద్ర కుమార్ సక్సేనా (55) ధమోరా ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో హెడ్మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన బాత్రూంలో రక్తపు మడుగులో పడి విగతజీవుడిగా ఉన్న స్థితిలో కనిపించారు.
సక్సేనా బాత్రూంకు వెళుతున్న సమయంలో ఓ విద్యార్థి ఆయన వెనుకగా వెళ్లి కాల్చి చంపినట్టు వెల్లడైంది. ఆ విద్యార్థి హెడ్మాస్టర్ తలకు గురిపెట్టి కాల్చడంతో, ఆయన అక్కడిక్కడే మరణించారు. తుపాకీ మోత వినిపించడంతో స్కూల్లో ఇతర పిల్లలు, ఉపాధ్యాయులు హడలిపోయారు. నిందితుడైన విద్యార్థి 12వ తరగతి చదువుతున్నాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ విద్యార్థి హెడ్మాస్టర్ బైక్ తీసుకుని పరారయ్యాడు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజి పరిశీలించిన పోలీసులు... హెడ్మాస్టర్ ను కాల్చి చంపిన విద్యార్థితోపాటు మరో విద్యార్థి కూడా పారిపోయినట్టు గుర్తించారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చేపట్టారు.