టీఎఫ్‌డీసీ ఛైర్మ‌న్‌గా నిర్మాత‌ దిల్ రాజు

 
ప్ర‌ముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌విని ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మ‌న్‌గా రాజును నియ‌మించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ప‌ద‌విలో ఆయ‌న రెండేళ్ల‌పాటు కొన‌సాగుతారు. 

కాగా, గ‌త ఎన్నిక‌ల్లో దిల్ రాజు కాంగ్రెస్ త‌ర‌ఫున ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌లేదు. తెర వెనుక ఆయ‌న కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తిచ్చిన‌ట్లు టాక్‌. ఇప్పుడు కాంగ్రెస్ స‌ర్కార్ దిల్ రాజుకు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది.


More Telugu News