అత్యధికులు మొగ్గుచూపిన సీఆర్డీఏ భవన నమూనా ఇదే

  • ఏపీ సీఆర్డీఏ భవన నమూనాపై ఓటింగ్‌కు మంచి స్పందన 
  • ఓటింగ్‌లో పాల్గొన్న 9,756 మంది
  • ప్రతిపాదిత నాలుగవ నమూనాకు అత్యధికుల మద్దతు
రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఏపీ సీఆర్డీఏ భవన నమూనాపై అధికారులు నిర్వహించిన అభిప్రాయ సేకరణకు ప్రజల నుంచి మంచి స్పందన కనబడింది. భవనం ఎలా ఉండాలనే దానిపై పది రకాల డిజైన్‌లను రూపొందించిన సీఆర్డీఏ .. అన్‌లైన్ విధానం ద్వారా ఓటింగ్ నిర్వహించింది. 

వారం రోజుల గడువులో 9,756 మంది ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. ప్రతిపాదిన నమూనాలలో ఆప్షన్ నాలుగవ నమూనాకు అత్యధికంగా 3,354 మంది ఓటు వేసి మద్దతు తెలిపారు. 3,279 ఓట్లతో ఆప్షన్ పది నమూనా రెండో స్థానంలో నిలిచింది. నమూనాలను, ఫలితాలను అధికారులు సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.     


More Telugu News