ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్!
- మలయాళంలో రూపొందిన సినిమా
- సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
- అక్కడ 35 కోట్లు రాబట్టిన కంటెంట్
- ఈ నెల 13 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్
మలయాళ ఇండస్ట్రీకి ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ ఏడాది ఆరంభం నుంచే భారీ విజయాలు నమోదు కావడం మొదలైంది. అప్పటి నుంచి వరుసగా మలయాళ ఇండస్ట్రీని భారీ విజయాలు పలకరిస్తూనే వస్తున్నాయి. రీసెంటుగా ఆ జాబితాలోకి 'బోగన్ విల్లియా' చేరిపోయింది. అమల్ నీరద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 17వ తేదీన థియేటర్లకు వచ్చింది.
'రుతింతే' అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కుంచకో బోబన్ .. ఫహాద్ ఫాజిల్ .. జ్యోతిర్మయి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అక్కడ 35 కోట్ల వరకూ వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా త్వరలో ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నెల 13వ తేదీన నుంచి ఈ సినిమా, మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది.
కథ విషయానికి వస్తే, రాయిస్ (కుంచకో బోబన్) రీతూ ( జ్యోతిర్మయి) భార్యాభర్తలు. ఇద్దరు పిల్లలతో వారి జీవితం హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన రీతూ గతాన్ని మరిచిపోతుంది. ఆమెను మామూలు మనిషిని చేయడానికి భర్త ప్రయత్నిస్తూ ఉంటాడు. కేరళకు వచ్చిన పర్యాటకులలో కొందరు మిస్సవుతుంటారు. ఆ మిస్టరీని ఛేదించడానికి ఏసీపీ డేవిడ్ (ఫహద్ ఫాజిల్) రంగంలోకి దిగుతాడు. జరుగుతున్న సంఘటనలకు రీతూ కారణమనేలా అతనికి ఆధారాలు లభిస్తాయి. ఏది నిజం? ఎవరు కారణం? అనేది కథ.