హైదరాబాద్-విజయవాడ హైవేపై లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... డ్రైవర్ దుర్మరణం

  • చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో ప్రమాదం
  • ముందు వెళుతున్న లారీని ఢీకొట్టిన లగ్జరీ బస్సు
  • ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి
హైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ నుంచి హైదరాబాద్ వెళుతున్న డీలక్స్ బస్సు.. ముందు వెళుతున్న ఓ లారీని ఢీకొట్టింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

బస్సు డ్రైవర్ మృతదేహం క్యాబిన్‌లో ఇరుక్కుపోయింది. దీంతో క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిచింది.


More Telugu News