ఛత్తీస్ గఢ్ లో మరోసారి కాల్పుల మోత... 12 మంది మావోయిస్టుల మృతి

  • అబూజ్ మడ్ అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్
  • భద్రతా బలగాలకు ఎదురుపడిన నక్సల్స్
  • మావోయిస్టులకు మరోసారి తీవ్ర నష్టం
  • కొనసాగుతున్న యాంటీ నక్సల్ ఆపరేషన్
ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు మరోసారి భారీ నష్టం జరిగింది. ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. 

నారాయణపూర్, దంతెవాడ, జగదల్ పూర్, కొండగావ్ జిల్లాల్లో నేడు భద్రతా బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ లో భాగంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో, తెల్లవారుజామున 3 గంటలకు భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు కూడా కాల్పులు ప్రారంభించాయి. 

ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటిదాకా 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలో యాంటీ నక్సల్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.


More Telugu News