మళ్లీ గెలిపిస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2,100 ఇస్తాం: కేజ్రీవాల్ హామీ

  • సీఎం అతిశీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్
  • రూ.2,100 మహిళ ఖాతాలోకి నేరుగా జమ చేస్తామని వెల్లడి
  • కొందరు మహిళల అభ్యర్థన మేరకు ఈ హామీ ఇచ్చినట్టు వెల్లడి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని తిరిగి గెలిపిస్తే 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.2,100 ఇస్తామని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఆటో డ్రైవర్లకు ఐదు హామీలను ఇచ్చింది. తాజాగా మహిళలకు రూ.2,100 ఇస్తామని తెలిపింది. ఈ మొత్తాన్ని నేరుగా మహిళ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.

ముఖ్యమంత్రి అతిశీతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ నేడు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి మహిళకు రూ.1,000 ఇస్తామని గతంలో హామీ ఇచ్చామని, అయితే కొంతమంది మహిళలు తన వద్దకు వచ్చి ద్రవ్యోల్బణం కారణంగా ఈ మొత్తం సరిపోదని చెబుతున్నారని తెలిపారు. వారి అభ్యర్థన మేరకు పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు రెండింతల కంటే ఎక్కువ పెంచినట్లు తెలిపారు.


More Telugu News