వైసీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు... కేక్ కట్ చేసిన జగన్
- మరికొన్ని రోజుల్లో క్రిస్మస్
- మేనత్తతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
- సందడిగా వైసీపీ ప్రధాన కార్యాలయం
క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన క్రిస్మస్ పర్వదినం (డిసెంబరు 25) సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో, తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో నేడు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్, ఆయన మేనత్త వైఎస్ విమలమ్మ, ఇతర వైసీపీ నేతలు, క్రైస్తవ మతపెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ తన మేనత్తతో కలిసి కేక్ కట్ చేశారు. పలువురికి ఆయన శాలువాలు కప్పి సన్మానించారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.