గుకేశ్‌కు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
- మన దేశం గర్వపడేలా చేశారంటూ రాష్ట్రపతి ట్వీట్
- గుకేశ్ పేరు సుస్థిరంగా నిలుస్తుందన్న ప్రధాని మోదీ
- ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందన్న ప్రధాని
- భారత్‌కు, తనకు గర్వించదగ్గ విషయమన్న విశ్వనాథన్ ఆనంద్
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచిన గుకేశ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా వారు ట్వీట్ చేశారు.
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలిచినందుకు గుకేశ్‌కు హృదయపూర్వక అభినందనలు... మన దేశం గర్వపడేలా చేశారంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
గుకేశ్ విజయం చారిత్రాత్మకమైనది... ఎంతోమంది యువతకు ప్రేరణనిచ్చేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గుకేశ్ అద్భుతమైన విజయం సాధించారని ప్రశంసించారు. అతడి అసమాన ప్రతిభ, కృషి, సంకల్పాల ఫలితమే ఈ విజయమని పేర్కొన్నారు.
ఈ విజయం చెస్ చరిత్రలో గుకేశ్ పేరును సుస్థిరం చేయడమే కాకుండా లక్షలాది మంది యువతకు గొప్ప కలలు కనేందుకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. కాగా, చెస్‌కు, భారత్‌కు, డబ్ల్యుసీఏకు, తనకూ ఇది గర్వించదగ్గ విషయమని విశ్వనాథన్ ఆనంద్ పేర్కొన్నారు.