టైమ్ మేగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్-2024'గా ట్రంప్

  • అమెరికా అధ్యక్షుడిగా రెండో పర్యాయం ఎన్నికైన ట్రంప్
  • ఈ ఏడాది మేటి వ్యక్తిగా టైమ్ మేగజైన్ గుర్తింపు
  • 2016లోనూ ఈ గుర్తింపు అందుకున్న ట్రంప్
ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మేగజైన్ ఈ ఏడాది మేటి వ్యక్తిగా అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఎంపిక చేసింది. పర్సన్ ఆఫ్ ద ఇయర్-2024గా ట్రంప్ పేరును ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికవడాన్ని టైమ్ ఘనంగా ప్రస్తావించింది. అమెరికా చరిత్రలోనే ఇది అసమాన ఘట్టం అని అభివర్ణించింది. 

ఈ విశిష్ట గుర్తింపునకు ట్రంప్ ఎంపికవడం ఇది రెండోసారి. 2016లోనూ ఆయన టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచారు. 78 ఏళ్ల ట్రంప్ 2017లో తొలిసారిగా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. 

అయితే, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ ను ఓడించి, రెండో పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.


More Telugu News