బంగాళాఖాతంలో ఎల్లుండి మరో అల్పపీడనం
- దక్షిణ అండమాన్ సముద్రంగా మీదుగా రేపటికి ఉపరితల ఆవర్తనం
- ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారుతుందన్న ఏపీఎస్డీఎంఏ
- ఈ నెల 16, 17 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో కొన్ని రోజుల కిందట ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడింది. ఇదిలా ఉంటే, బంగాళాఖాతంలో ఎల్లుండి (డిసెంబరు 15) మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.
దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా రేపటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని, ఇది ఎల్లుండికి అల్పపీడనంగా బలపడుతుందని వివరించింది. ఇది అల్పపీడనంగా మారాక, తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరానికి చేరువగా వస్తుందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 16న నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 17న కోస్తా, రాయలసీమలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వర్షాల నేపథ్యంలో, రైతులు వ్యవసాయ పనుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది.