’నిన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నా‘ అంటూ ప్యాసింజర్ కు ఉబెర్ డ్రైవర్ మెసేజ్
- భయంతో వణికిపోయిన ప్యాసింజర్.. గురుగ్రామ్ లో ఘటన
- రైడ్ క్యాన్సిల్ చేసుకుని ఇంట్లోకి పరుగు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టు
గురుగ్రామ్ లో రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్న ఓ ప్రయాణికుడికి భయంకరమైన అనుభవం ఎదురైంది. త్వరగా రమ్మంటూ మెసేజ్ చేసిన ప్యాసింజర్ కు క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన జవాబుతో వణుకుపుట్టింది. నిన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నా అంటూ డ్రైవర్ మెసేజ్ చేయడంతో భయాందోళనలకు గురైన ప్యాసింజర్.. తన ప్రయాణం మానుకుని ఇంటి లోపలికి వెళ్లి తలుపులు బిడాయించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. కుష్ పైరో1 అనే రెడ్డిట్ యూజర్ పెట్టిన పోస్ట్ ప్రకారం..
‘ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నా. మరో గంటలో రైలు బయలుదేరుతుంది. త్వరగా రమ్మంటూ డ్రైవర్ కు మెసేజ్ చేశా. ఆ తర్వాత ఫోన్ ను జేబులో పెట్టుకుని లగేజీతో రోడ్డుపైకి వచ్చా. కాసేపటి తర్వాత ఓటీపీ చూద్దామని ఫోన్ బయటకు తీశా. ఉబెర్ యాప్ లో డ్రైవర్ చేసిన మెసేజ్ నన్ను భయాందోళనలకు గురిచేసింది. త్వరగా రమ్మని నేను పెట్టిన మెసేజ్ కు ఆ డ్రైవర్ నిన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నా అంటూ జవాబిచ్చాడు. అది చూసి నాకు వెన్నులో వణుకుపుట్టింది. వెంటనే స్క్రీన్ షాట్ తీసుకున్నా. రైడ్ క్యాన్సిల్ చేద్దామని ప్రయత్నించేలోగా ఆ డ్రైవరే క్యాన్సిల్ చేశాడు. భయంతో నేను లగేజీ తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోయా. ప్రయాణం రద్దు చేసుకున్నా. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలా? లేక ఉబెర్ కంపెనీకి కంప్లైంట్ చేయాలా?’ అంటూ రెడ్డిట్ లో పోస్ట్ చేశాడు. అయితే, ఈ పోస్ట్ పై ఉబెర్ ఇంకా స్పందించలేదు.