అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలి: సీపీఐ నేత డి.రాజా

  • అదానీని అరెస్టు చేసి విచారిస్తే విద్యుత్ ఒప్పందాలపై నిజాలు బయటకు వస్తాయన్న సీపీఐ నేత 
  • జమిలి ఎన్నికలకు సీపీఐ వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేసిన రాజా
  • ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ, లౌకికవాదాన్ని కాపాడేందుకు జమిలి ఎన్నికలను వ్యతిరేకించాలని పిలుపు 
గత ప్రభుత్వ హయాంలో అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా డిమాండ్ చేశారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అదానీని అరెస్టు చేసి విచారిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. 

జమిలి ఎన్నికలకు సీపీఐ వ్యతిరేకమని స్పష్టం చేశారు. గతంలోనే లా కమిషన్, రామ్‌నాథ్ కోవింద్ కమిటీకి అభ్యంతరాలతో నివేదిక సమర్పించామని చెప్పారు. ఇండియా కూటమిలోని పార్టీలు వ్యతిరేకతను వ్యక్తం చేయాలన్నారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ, లౌకికవాదాన్ని కాపాడేందుకు జమిలి ఎన్నికలను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
కాగా, ఈ నెల 26న కాన్పూరులో సీపీఐ శత వార్షికోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. సీపీఐ జాతీయ మహాసభలు వచ్చే ఏడాది సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు చండీగఢ్‌లో నిర్వహించనున్నామని డి రాజా తెలిపారు.   


More Telugu News